logo

పాలమూరు ఓటర్లు @ 34,20,724

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఎస్‌ఆర్‌-2024 ఓటర్ల జాబితాకు అదనంగా కొత్త ఓటర్లను చేర్చి ఎన్నికల అధికారులు తుది జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో కొత్త ఓటర్లను చేర్చడంతోపాటు చనిపోయిన, స్థానికంగా లేనివారి ఓట్లను తొలగించారు.

Updated : 08 May 2024 06:43 IST

మహబూబ్‌నగర్‌లో 15,274, నాగర్‌కర్నూల్‌లో 7,538 మంది కొత్తగా నమోదు

ఈనాడు, మహబూబ్‌నగర్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఎస్‌ఆర్‌-2024 ఓటర్ల జాబితాకు అదనంగా కొత్త ఓటర్లను చేర్చి ఎన్నికల అధికారులు తుది జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో కొత్త ఓటర్లను చేర్చడంతోపాటు చనిపోయిన, స్థానికంగా లేనివారి ఓట్లను తొలగించారు. పూర్వ మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాల్లో మొత్తం 34,20,724 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే కొత్త జాబితాను రాజకీయ పార్టీల నేతలకు అందించారు. ఈ జాబితా ప్రకారం మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8,32,256 మంది పురుషులు, 8,50,172 మంది మహిళలు, 42 మంది ఇతరులున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో 2,977 మంది పురుషులు, 8,385 మంది స్త్రీలు, ముగ్గురు ఇతరులు కలిపి మొత్తం 15,274 మంది కొత్తగా నమోదయ్యారు. స్థానికంగా లేని, చనిపోయిన వారిలో 6,713 మంది పురుషులు, 6,508 మంది స్త్రీలు మొత్తం కలిపి 13,221 మందిని జాబితా నుంచి తొలగించారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8,64,875 మంది పురుషులు, 8,73,340 మంది మహిళలు, 39 మంది ఇతరులు ఉన్నారు. ఈ స్థానం పరిధిలో 3,501 మంది పురుషులు, 4,035 మంది మహిళలు, ఇతరులు ఇద్దరు కలిపి మొత్తం 7,538 మంది కొత్తగా  ఓటు నమోదు చేసుకున్నారు. స్థానికంగా లేనివారు, చనిపోయిన వారిని కలిపి 4,480 మంది పురుషులు, 3,983 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు మొత్తం 8,465 మందిని జాబితా నుంచి తొలగించారు. మార్పులు, చేర్పుల తర్వాత మహబూబ్‌నగర్‌ పరిధిలో అదనంగా 2,053, నాగర్‌కర్నూల్‌  పరిధిలో 3,481 మంది ఓటర్లు పెరిగారు. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎక్కువగా 2,59,260 మంది ఓటర్లు, జడ్చర్ల సెగ్మెంట్‌లో 2,22,838 మంది తక్కువ ఓటర్లు ఉన్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ పరిధిలో అత్యధిక ఓటర్లు వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 2,73,863 మంది ఉన్నారు. తక్కువగా నాగర్‌కర్నూల్‌ సెగ్మెంట్‌లో 2,36,094 మంది ఓటర్లు ఉన్నారు. ఐదు(వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌, అలంపూర్‌, అచ్చంపేట) సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. రెవెన్యూ  కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా వైబ్‌సైట్‌లో ఓటర్లు తమ పేరు ఉందో? లేదో? చెక్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు