logo

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ

మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శుక్రవారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు.

Updated : 10 May 2024 17:35 IST

రాజోలి: మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శుక్రవారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఎంపీడీవో రమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎంఆర్సీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొన్ని రోజుల క్రితం గ్రామాల్లో డీఆర్పీలు సేకరించిన సమాచారాన్ని డీఆర్డీవో నర్సింగ్రావ్ మండల స్థాయిలో చర్చించారు. మండల వ్యాప్తంగా మొత్తం 486 పనులకు సంబంధించి రూ.2.86 కోట్ల పనులు చేపట్టారు. వీటిని ఏ ఏ గ్రామంలో ఎంత వెచ్చించారు. ఏ పనులు చేశారో రికార్డు రూపంలో ఆయన పరిశీలించారు. ఇందులో ముఖ్యంగా కూలీలకు డబ్బులు సక్రమంగా చెల్లించలేదని, మొక్కలు నాటి నిర్లక్ష్యంగా వదిలేశారని గుర్తించారు. ఇలా మొత్తం రూ.38,550లు కార్యదర్శులు, క్షేత్ర సహాయకుల నుంచి రికవరీ చేయాలని ఎంపీడీవోను డీఆర్డీవో ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని