logo

పదెకరాలు.. 20 వేల టన్నుల సామర్థ్యం

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పురపాలిక పరిధి అల్లాపూర్‌ టోల్‌గేట్‌ వద్ద మరో భారీ నిర్మాణం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో రైతు బజార్‌ వెనుక 20 వేల టన్నుల సామర్థ్యంతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ భారీ గోదాముల నిర్మాణానికి పూనుకుంది. పదెకరాల్లో రూ.16.50 కోట్ల నిధులతో

Published : 17 Jan 2022 01:57 IST

రూ.16.50 కోట్లతో భారీ గోదాములు

● రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో అల్లాపూర్‌ టోల్‌గేట్‌ వద్ద నిర్మాణం

న్యూస్‌టుడే, తూప్రాన్‌


నిర్మాణంలో ఉన్న గోదాములు
మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పురపాలిక పరిధి అల్లాపూర్‌ టోల్‌గేట్‌ వద్ద మరో భారీ నిర్మాణం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో రైతు బజార్‌ వెనుక 20 వేల టన్నుల సామర్థ్యంతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ భారీ గోదాముల నిర్మాణానికి పూనుకుంది. పదెకరాల్లో రూ.16.50 కోట్ల నిధులతో నాలుగు గోదాముల పనులు శరవేగంగా సాగుతున్నాయి. రెండు మాసాల క్రితం పనులు ప్రారంభించగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇవి పూర్తయితే జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో పండించిన ఉత్పత్తుల నిల్వకు ఇబ్బందులు తొలగనున్నాయి.

బీజం పడింది ఇలా..

తూప్రాన్‌ పురపాలిక పరిధి అల్లాపూర్‌ టోల్‌గేట్‌ వద్ద వ్యవసాయ విపణి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 22 ఎకరాల భూమిని కేటాయించింది. అక్కడ 12 ఎకరాల్లో వ్యవసాయ విపణి పనులు ఇప్పటికే చేపట్టారు. ఇంకా 10 ఎకరాల భూమి ఉందన్న విషయాన్ని ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం అక్కడ గోదాములు నిర్మించాలని భావించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించగా వారి ఆదేశాలతో పనులు చేపట్టారు. ఈ గోదాములు 44వ జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఉండటంతో భవిష్యత్‌లో బహుళ ప్రయోజనకరంగా మారుతాయని అధికారులు భావిస్తున్నారు.


మూడు మాసాల్లో పనులు పూర్తి చేస్తాం..

- రాధాకృష్ణమూర్తి, ఎస్‌ఈ, రాష్ట్ర గిడ్డంగుల నిర్మాణ సంస్థ

అల్లాపూర్‌ టోల్‌గేట్‌ వద్ద 20 వేల టన్నుల సామర్థ్యంతో నాలుగు గోదాములను నిర్మిస్తున్నాం. ప్రభుత్వం జూన్‌ వరకు గడువు ఇచ్చినా ఏప్రిల్‌ లోపు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. వీలైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తాం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని