logo

సులభ విధానం.. సంఘాల బలోపేతం

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మహిళా సంఘాలూ మారుతున్నాయి. బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడంతోపాటు అధికారుల సూచనలు పాటిస్తూ అభ్యున్నతి దిశగా అడుగులు వేస్తున్నాయి. సంఘాల్లో సభ్యులుగా చేరిన మహిళలకు అనుభవం ఉన్న రంగంలో

Published : 23 Jan 2022 04:57 IST

జిల్లాలో ప్రయోగాత్మక ప్రక్రియ


మహిళా సంఘం సభ్యుల సమావేశం

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మహిళా సంఘాలూ మారుతున్నాయి. బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడంతోపాటు అధికారుల సూచనలు పాటిస్తూ అభ్యున్నతి దిశగా అడుగులు వేస్తున్నాయి. సంఘాల్లో సభ్యులుగా చేరిన మహిళలకు అనుభవం ఉన్న రంగంలో రాణించేలా ప్రత్యేక రుణాలు అందిస్తూ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఆర్థిక ప్రగతి కోసం బ్యాంకుతోపాటు స్త్రీనిధి రుణాలు సైతం సద్వినియోగం చేసుకుంటున్నారు. సంఘాలను మరింత పటిష్టం చేయాలన్న లక్ష్యంతో తాజాగా ఆన్‌లైన్‌ గ్రేడింగ్‌ విధానాన్ని సులభతరం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసిన నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం

ఎవరిపై ఆధార పడకుండా..

జిల్లాలో 18,089 మహిళా సంఘాలు ఉండగా.. వాటిలో 1.90 లక్షల మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. ఐకేపీ వీవోఏలు ప్రతి నెలా చివరి వారంలో సంఘాల పని తీరును బేరీజు వేసి వివరాలను దస్త్రాల్లో పొందుపరుస్తున్నారు.  కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (సీసీ) సంఘాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయగానే వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆ విధానంలో మార్పులు చేయనున్నారు. వీవోఏ, బుక్‌కీపర్లు నేరుగా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ జయప్రదం అయితే ఇక మీదట గ్రేడింగ్‌ల కోసం సీసీలపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌) నుంచి ఈ విధానం పూర్తిస్థాయిలో అమలుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు.

12 అంశాల ఆధారంగా..

నమోదు చేసిన వివరాల ప్రకారం.. సంఘాలకు 12 అంశాల ఆధారంగా ఏ, బీ, సీ, డీ, ఈ గ్రేడింగ్‌లు జనరేట్‌ అవుతాయి. ఒక్కో సంఘం 75 శాతానికి పైగా సాధిస్తే ‘ఏ’ గ్రేడ్‌, 70 నుంచి 75 సాధిస్తే ‘బీ’, 60లోపు సాధిస్తే ‘సీ’, మైనస్‌ 70శాతం సాధిస్తే ‘డీ’, అంతకంటే దయనీయంగా ఉంటే ‘ఈ’ గ్రేడింగ్‌ కింద లెక్కిస్తారు. ఏ, బీ, సీ గ్రేడింగ్‌లో ఉన్న సంఘాలకే రుణాలు పంపిణీ చేస్తారు.


ప్రత్యేక దృష్టి సారించేందుకు వీలు

వీవోఏలు, బుక్‌ కీపర్లు గ్రేడింగ్‌ విధానం కొనసాగిస్తే సంఘాల పరిస్థితి ఎప్పటికప్పుడు అధికారులకు తెలిసే అవకాశం ఉంటుంది. దీనివల్ల మహిళా సంఘాలపై పర్యవేక్షణ మరింత పెరగనుంది. ఇప్పటికే మహిళా సంఘాల సమావేశాల సమావేశాలకు సంబంధించి అక్షాంశ, రేఖాంశాలతో కూడిన లైవ్‌ ఫొటో తప్పనిసరి చేశారు. రుణ వాయిదాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రేడింగ్‌లో వెనుకబడకుండా అధికారులు సంఘాల వారీగా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని సమీక్షలు నిర్వహించనున్నారు.


పక్కాగా సమావేశాలు నిర్వహించేలా
-సూర్యారావు, అదనపు డీఆర్డీవో

మహిళా స్వయం సహాయ సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఆన్‌లైన్‌ గ్రేడింగ్‌ విధానంతో సంఘాల్లో సభ్యులుగా మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది. సమావేశాలు పక్కాగా నిర్వహించడంతోపాటు బ్యాంకు, స్త్రీ నిధి రుణ వాయిదాలు సక్రమంగా చెల్లిస్తేనే మంచి గ్రేడింగ్‌ సాధించేందుకు వీలుంటుంది. ఐకేపీ వీవోఏలు, బుక్‌ కీపర్లతోనే గ్రేడింగ్‌ ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు