logo

తుపాకుల లచ్చవ్వకు దక్కనున్న ఇంటి గౌరవం

శౌచాలయాన్నే నివాసంగా చేసుకున్న వృద్ధురాలు తుపాకుల లచ్చవ్వకు స్థానిక సర్పంచి చౌడుచెర్ల మమత అండగా నిలిచారు. 2021 డిసెంబర్‌ 2న ‘ఈనాడు’లో ‘చెదిరిన గూడు..

Published : 24 Jan 2022 01:05 IST

దాత నిర్మిస్తున్న ఇల్లు

నంగునూరు, న్యూస్‌టుడే: శౌచాలయాన్నే నివాసంగా చేసుకున్న వృద్ధురాలు తుపాకుల లచ్చవ్వకు స్థానిక సర్పంచి చౌడుచెర్ల మమత అండగా నిలిచారు. 2021 డిసెంబర్‌ 2న ‘ఈనాడు’లో ‘చెదిరిన గూడు.. శౌచాలయమే అడ్డా’ శీర్షికన నంగునూరులో వృద్ధురాలు పడుతున్న తిప్పలు వివరిస్తూ కథనం ప్రచురితమైంది. స్పందించిన స్థానిక సర్పంచి రూ.60 వేలు సొంత డబ్బులు వెచ్చించి ఇంటి నిర్మాణం చేయించి, ఇస్తున్నారు. మరో పదిహేను రోజుల్లో పూర్తి చేసి వృద్ధురాలి గృహ ప్రవేశానికి చర్యలు తీసుకుంటామని సర్పంచి తెలిపారు. వృద్ధురాలు లచ్చవ్వకు భర్త లేడు. ముగ్గురు ఆడపిల్లలు ఉండగా పెళ్లిళ్లు చేశారు. సొంతింట్లో నివసిస్తుండగా ఐదు నెలల క్రితం కురిసిన వర్షాలకు కూలిపోయింది. అప్పటి నుంచి ఆమె శౌచాలయం గదిలో ఉంటూ అవస్థలు పడుతుండగా సర్పంచి స్పందించి ఇల్లు కట్టిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని