logo

జలసిరికి ఊతం!

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో నీటి ఎద్దడి నివారించి, భూగర్భజలాలు పెంపొందించేందుకు ‘మిషన్‌ అమృత సరోవర్‌’ పథకం అమలు చేయాలని సంకల్పించింది. జిల్లాలో

Published : 20 May 2022 01:15 IST

న్యూస్‌టుడే, మెదక్‌

పథకానికి ఎంపికైన హవేలిఘనపూర్‌లోని పెద్దచెరువు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో నీటి ఎద్దడి నివారించి, భూగర్భజలాలు పెంపొందించేందుకు ‘మిషన్‌ అమృత సరోవర్‌’ పథకం అమలు చేయాలని సంకల్పించింది. జిల్లాలో వంద ఎకరాల లోపు 2,177 చెరువులు, వంద ఎకరాలకు పైబడి 238... 500 ఎకరాలకు పైబడి 15 చెరువులు ఉన్నాయి. ఎంపిక చేసిన వాటిలో ముళ్లపొదల తొలగింపు, పూడికతీత, కట్ట పటిష్టం చేయనున్నారు. ఉపాధి హమీలో నిధుల ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇక పథకం కింద ఒకటిన్నర ఎకరం విస్తీర్ణంలో కొత్తగా చెరువులు నిర్మించేందుకు స్థలం సేకరిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు అందుబాటులో లేని చోట అటవీ ప్రాంతాల్లో కూడా నిర్మించనున్నారు. ఒక్కో చెరువుకు 300-500 పనిదినాలు లక్ష్యంగా విధించారు. జిల్లాలో 75 చెరువులను ఎంపిక చేయగా అత్యధిక శాతం పాతవాటికే మరమ్మతులు చేయనున్నారు. 12 ప్రాంతాల్లో కొత్త వాటిని నిర్మించనున్నారు. మరోవైపు జలవనరులు కబ్జాకు గురికాకుండా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

త్వరలో పనులు ప్రారంభం

అమృత్‌ సరోవర్‌ పథకం కింద జిల్లాలో 75 పనులను గుర్తించాం. కొత్తగా 12 చెరువులు తవ్వనున్నాం. త్వరలో పనులను ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువుల మరమ్మతులతో నీటి లభ్యత పెరిగింది. ఈ కొత్త పథకం ద్వారా చేపట్టనున్న పనులతో జలవనరులు మరింత వృద్ధి చెందనున్నాయి.

- శ్రీనివాస్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని