logo

మృత్యుఒడికి చేరి.. తొమ్మిది మందికి జీవం పోసి..

ఇంటర్‌ చదువుతున్న ఓ విద్యార్థి బ్రెయిన్‌ డెడ్‌ కాగా, పుట్టెడు దుఃఖంలో ఉన్న అతడి తల్లిదండ్రులు కుమారుడి అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వివరాలు ఇలా.. మెదక్‌ పట్టణానికి చెందిన రాయకంటి శ్రీనివాస్‌, జ్యోతి

Published : 21 May 2022 01:26 IST

న్యూస్‌టుడే, మెదక్‌: ఇంటర్‌ చదువుతున్న ఓ విద్యార్థి బ్రెయిన్‌ డెడ్‌ కాగా, పుట్టెడు దుఃఖంలో ఉన్న అతడి తల్లిదండ్రులు కుమారుడి అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వివరాలు ఇలా.. మెదక్‌ పట్టణానికి చెందిన రాయకంటి శ్రీనివాస్‌, జ్యోతి దంపతుల కుమారుడు మోక్షిత్‌ (18) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం ఇంటర్‌ చివరి పరీక్ష రాయాల్సి ఉండగా, బుధవారం రాత్రి కళాశాల వసతి గృహంలో తలనొప్పితో బాధపడ్డాడు. దీంతో యాజమాన్యం వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యాడని వైద్యులు తేల్చిచెప్పారు. విషయాన్ని కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో మోక్షిత్‌ శుక్రవారం సాయంత్రం బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న జీవన్‌ దాన్‌ ప్రతినిధులు మోక్షిత్‌ తల్లిదండ్రులను కలిసి అవయవ దానంపై అవగాహన కల్పించారు. దీంతో వారు అంగీకరించారు. అతడి కళ్లు, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం, క్లోమం సేకరించి మరో తొమ్మిది మందికి అమర్చారు. మోక్షిత్‌ ఈ నెల 8న జన్మదిన వేడుకలు జరుపుకొన్నాడు. కొడుకు బ్రెయిన్‌డెడ్‌ అయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ అతడి అవయవాలు దానం చేసి మరో తొమ్మిది మంది బతికేందుకు కారణమై మానవత్వం చాటిన దంపతులను పలువురు ప్రశంసించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని