logo

‘ధరణి’లో పేదల భూములు మాయం: గద్దర్‌

అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఓట్లను గుంజుకుంటూ సంక్షేమాన్ని పాలకులు విస్మరించారని, రాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చడం లేదని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు.

Published : 01 Apr 2023 01:41 IST

మద్యం మానేస్తామని యువకులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ప్రజాగాయకుడు

రాయపోల్‌, న్యూస్‌టుడే: అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఓట్లను గుంజుకుంటూ సంక్షేమాన్ని పాలకులు విస్మరించారని, రాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చడం లేదని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. రాయపోల్‌ మండలం బేగంపేట గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలు సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా గద్దర్‌ మాట్లాడుతూ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ధరణి పోర్టల్‌లో పేద ప్రజల భూములు మాయమై ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. మల్లన్న సాగర్‌ జలాశయంలో పేదల భూములు, బతుకులు మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు పిల్లలు ఎంతో కొంత చదువు నేర్పించాలని సూచించారు. మద్యం తాగమని యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, అంబేడ్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు ప్రకాష్‌, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మంకిడి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని