logo

గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్‌రావు

అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

Published : 19 Apr 2024 01:41 IST

హరీశ్‌రావు, వినోద్‌కుమార్‌లను గజమాలతో సత్కరిస్తున్న నాయకులు

బెజ్జంకి, న్యూస్‌టుడే: అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం సాయంత్రం బెజ్జంకిలో కరీంనగర్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి బోయినిపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కూడలి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం రోడ్‌షోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినోద్‌కుమార్‌ విజన్‌ ఉన్న నాయకుడని, గతంలో కరీంనగర్‌ ఎంపీగా పని చేసి స్మార్ట్‌సిటీ తేవడంలో కీలకపాత్ర పోషించారన్నారు. కేంద్రంతో కోట్లాడి పలు రైలు మార్గాలతో పాటు జాతీయ రహదారులను సాధించారని తెలిపారు. నాలుగు నెలల కాలంలోనే కాంగ్రెస్‌ పాలన ఆగమైందని, ఎన్నికల ప్రచారానికి వచ్చే నాయకులను హామీలు ఏమయ్యాయని నిలదీయాలన్నారు. ఐదేళ్ల కాలంలో భాజపా ఎంపీ బండి సంజయ్‌ చేసిందేమి లేదని ఆరోపించారు. గుగ్గిళ్ల, పోతారం శివారులలో నిర్మిస్తున్న ఇథనాల్‌ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేసే వరకు ప్రజలకు అండగా ఉద్యమిస్తామని తెలిపారు. ఎంపీ అభ్యర్థి  వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి కేసీఆర్‌ వెన్నంటి ఉన్నానని, హక్కుల కోసం న్యాయవాద వృత్తిని వదిలి ప్రజా సేవకు పాటుపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ కోఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బాలకిషన్‌, ఎంపీపీ నిర్మల, మండల అద్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

హరీశ్‌రావు, వినోద్‌కుమార్‌లను గజమాలతో సత్కరిస్తున్న నాయకులు, ప్రచార సభకు హాజరైన జనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని