logo

ఓటు పాఠం.. అవగాహన కీలకం

ప్రజాస్వామ్యంలో ఓటింగ్‌ కీలకమన్నది అందరికీ తెలిసిందే. 18 ఏళ్లకు ఓటు హక్కు పొందవచ్చు. అయితే అంతకంటే ముందే విద్యార్థిగా ఉన్న సమయంలో పోలింగ్‌ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 16వ పాఠంగా ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠ్యాంశాన్ని పొందుపర్చారు.

Published : 01 May 2024 01:56 IST

 నమూనా పోలింగ్‌లో విద్యార్థుల బారులు
ప్రజాస్వామ్యంలో ఓటింగ్‌ కీలకమన్నది అందరికీ తెలిసిందే. 18 ఏళ్లకు ఓటు హక్కు పొందవచ్చు. అయితే అంతకంటే ముందే విద్యార్థిగా ఉన్న సమయంలో పోలింగ్‌ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 16వ పాఠంగా ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠ్యాంశాన్ని పొందుపర్చారు. ఇక ప్రతి ఏటా పాఠశాలల్లో ఉపాధ్యాయులు.. విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించే ఉద్దేశంతో నమూనా ఎన్నికలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. పాఠంలో ఉన్న మేర ఎన్నికల కమిషనర్‌, ప్రకటన, పోలింగ్‌కు సన్నద్ధం, రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థులు పోటీ చేయడం, ఓటింగ్‌, లెక్కింపు తదితర అంశాలన్నింటినీ వివరించి విద్యార్థులతో చేయిస్తున్నారు. పిల్లలే అన్ని పాత్రలను పోషిస్తున్నారు. అభ్యర్థులుగా నిల్చోని ప్రచారం సైతం చేస్తూ ఆకట్టుకుంటున్నారు.            

- న్యూస్‌టుడే, బొంరాస్‌పేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు