logo

సరకుల అక్రమ తరలింపు.. ఇద్దరి తొలగింపు

హుస్నాబాద్‌ మండలం జిల్లెల్లగడ్డ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం నుంచి బియ్యం, పప్పులు ఇతర సామగ్రి అక్రమ తరలింపు వ్యవహారంపై ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ 27న పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారని విద్యాలయాల ప్రాంతీయ సమన్వయకర్త డీఎస్‌ వెంకన్న మంగళవారం తెలిపారు.

Published : 01 May 2024 01:53 IST

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ మండలం జిల్లెల్లగడ్డ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం నుంచి బియ్యం, పప్పులు ఇతర సామగ్రి అక్రమ తరలింపు వ్యవహారంపై ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ 27న పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారని విద్యాలయాల ప్రాంతీయ సమన్వయకర్త డీఎస్‌ వెంకన్న మంగళవారం తెలిపారు. ఇద్దరు వంట కార్మికులను తొలగించామని.. వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశామన్నారు.న్యాయ సలహా మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తోట మహేశ్‌ చెప్పారు. క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని యూఎస్‌ఎఫ్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలోతు రాజేశ్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని