logo

జహీరాబాద్‌కు 10 నామినేషన్లు దాఖలు

జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ కుమార్‌ షెట్కార్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు.

Published : 25 Apr 2024 02:32 IST

నామపత్రాలు అందజేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ కుమార్‌ షెట్కార్‌, చిత్రంలో మంత్రి దామోదర్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ తదితరులు
సంగారెడ్డి టౌన్‌, న్యూస్‌టుడే: జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ కుమార్‌ షెట్కార్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు. భారాస అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌.. మాజీ మంత్రి హరీశ్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీతో కలిసి వచ్చి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ధర్మ సమాజ్‌ పార్టీ అభ్యర్థి దేవ శిఖమని, రాష్ట్ర సామాన్య ప్రజల పార్టీ అభ్యర్థి మున్వర్‌ హుసేన్‌, బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థి బాల్‌రాజ్‌, స్వతంత్ర అభ్యర్థులు అశోక్‌, జైపాల్‌ నాయక్‌, రమేశ్‌, యాకుబ్‌ షరీఫ్‌, మాణయ్య నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారిణికి సమర్పించారు.

మెదక్‌ పార్లమెంట్‌ స్థానానికి..

 మెదక్‌: మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌రాజ్‌కు దాఖలు చేశారు. నర్సాపూర్‌, పటాన్‌చెరు ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, మహిపాల్‌రెడ్డి, మెదక్‌ జడ్పీ అధ్యక్షురాలు హేమలత, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ భట్టి జగపతితో కలిసి ఒక సెట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌తో కలిసి మరో సెట్‌ నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మదన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, నాయకురాలు సుహాసినిరెడ్డితో కలిసి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు ఆయన కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు రమేశ్‌, ప్రదీప్‌కుమార్‌, ఆంజనేయులు, నరహరి, భానుచందర్‌, యుగతులసీ పార్టీ అభ్యర్థి అనిల్‌ మొదటి సెట్‌ నామినేషన్‌ వేయగా, ధర్మసమాజ్‌ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్‌, విముక్తి చిరుతల కక్షి పార్టీ అభ్యర్థి ఎల్లయ్య, స్వతంత్ర అభ్యర్థులు లక్ష్మినారాయణ, నవీన్‌ మరో సెట్‌ నామపత్రాలు సమర్పించారు.

 జహీరాబాద్‌: సంగారెడ్డిలో బుధవారం జరిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌షెట్కార్‌ నామినేషన్‌ కార్యక్రమానికి జహీరాబాద్‌ నుంచి ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. పార్టీ  నియోజకవర్గ ఛీఫ్‌ కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు.

నేడు తుది గడువు

నామపత్రాల దాఖలుకు గురువారం తుది గడువు. ఇప్పటి వరకు మెదక్‌ పార్లమెంట్‌ స్థానానికి 33 మంది అభ్యర్థులు 55 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ప్రధాన పార్టీలైన భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు, భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌ వేశారు. వీరితో పాటు ఆయా పార్టీల తరఫున పలువురు, స్వతంత్ర అభ్యర్థులుగా మరికొందరు నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్‌ వేయడానికి అవకాశం ఉంది. వచ్చిన నామినేషన్లను ఈనెల 26న పరిశీలించనున్నారు. 29 వరకు ఉప సంహరణకు గడువు విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని