logo

జహీరాబాద్‌కు 69.. మెదక్‌కు 90

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు.

Published : 26 Apr 2024 01:22 IST

ముగిసిన నామపత్రాల స్వీకరణ

భారాస అభ్యర్థి అనిల్‌కుమార్‌ తరఫున నామపత్రాలు సమర్పిస్తున్న భూపాల్‌రెడ్డి, నాయకులు

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల తరఫున సురేష్‌ కుమార్‌ షెట్కార్‌(కాంగ్రెస్‌), గాలి అనిల్‌కుమార్‌(భారాస), బీబీ పాటిల్‌(భాజపా)లతోపాటు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. బుధవారం భారాస అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ తరఫున నారాయణఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, డీసీసీబీ ఉమ్మడి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు జైపాల్‌రెడ్డి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. 

మెదక్‌: మెదక్‌ లోక్‌సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌ తరఫున నీలం మధు, భాజపా తరఫున రఘునందన్‌రావు, భారాస నుంచి వెంకట్రాంరెడ్డి నామపత్రాలు అందజేశారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామపత్రాలు సమర్పించారు. నేడు నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని