logo

ఓటమి భయంతోనే భాజపా ఆరోపణలు

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా తక్కువ సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి ఉందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని జహీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ ఆరోపించారు.

Published : 02 May 2024 06:12 IST

మాట్లాడుతున్న సురేష్‌ షెట్కార్‌.. పక్కన రాములునాయక్‌, నాయకులు

నారాయణఖేడ్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో భాజపా తక్కువ సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి ఉందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని జహీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ ఆరోపించారు. బుధవారం ఖేడ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులం, మతం పేరిట భాజపా ఓట్లు అడుగుతోందన్నారు. రిజర్వేషన్ల కాపాడుకోవాలంటే, యువత, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. తాను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. పదేళ్లు ఎంపీగా ఉన్న బీబీ పాటిల్‌ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, ప్రజలకు అందుబాటులో లేరని విమర్శించారు. ఈ విషయమై తాను బీబీ పాటిల్‌తో చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. భారాసకు ఇవే చివరి ఎన్నికలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు డా.గిరిజా షెట్కార్‌, ప్రకాష్‌ రాథోడ్‌, గోవింద్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు