logo
Published : 27/11/2021 05:15 IST

పట్టువీడని స్వతంత్రులు..

విజయానికి తెరాస కసరత్తులు

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అనివార్యమైంది. శుక్రవారం నామ పత్రాల ఉపసంహరణ గడువు ముగిసింది. అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎంసీ కోటిరెడ్డితో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు కాసం వెంకటేశ్వర్లు, కొర్రా రాంసింగ్‌, బెజ్జం సైదులు, ఆరుపుల శ్రీశైలం, కె.నగేష్‌, వంగూరి లక్ష్మయ్య పోటీలో ఉన్నారు. ఏకగీవ్రం కోసం అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్వతంత్ర అభ్యర్థులకు భారీ స్థాయిలో ఆఫర్‌ ఇచ్చినా వారు నామపత్రాల ఉపసంహరణకు ముందుకు రానట్లు సమాచారం. పోటీ అనివార్యం కావడంతో ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం బరిలో ఉన్న ఆరుగురు స్వతంత్రులకు కాంగ్రెస్‌ పార్టీతో పాటు తెరాసలోని కొంత మంది అసమ్మతి నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రనిధులు లోపాయికారిగా మద్దతు ఇస్తుండటంతో వారు పోటీ నుంచి విరమించుకోకుండా బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. ఏకగ్రీవం చేజారి పోవడంతో ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ ముఖ్యులు కసరత్తు ప్రారంభించారు. కాంగ్రెస్‌ పార్టీ లోపాయికారి మద్దతు ఉన్న ఇద్దరు అభ్యర్థులపై దృష్టి పెట్టారు. మిగతా అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఏకగ్రీవం కాకుండా నివారించాలనే కాంగ్రెస్‌ ముఖ్య నాయకుని ప్రయత్నం ఫలించింది. అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు తమ పార్టీ వారితో పాటు అధికార పార్టీలో తమకు అనుకూలంగా ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులతో ఓ కాంగ్రెస్‌ నేత మంతనాలు జరుపుతుండటంతో పోటీ రసవత్తరంగా మారే అవకాశముంంది. అధికార పార్టీ తన ఓటర్లలందరిని వేర్వేరు ప్రాంతాకు తరలించేందుకు పార్టీ ముఖ్యులు చర్చించినట్లు తెలిసింది. జిల్లాలో 1271 మంది ఓటర్లు ఉన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని