Ts News: యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్లో కరోనా కలకలం
యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కొవిడ్ కేసుల కలకలం రేగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 12 మంది పోలీసులకు కరోనా నిర్ధారణ అయింది. యాదగిరిగుట్ట ఏసీపీ, సీఐ, మరో 10 మంది కానిస్టేబుళ్లు కరోనా బారినపడ్డారు. దీంతో వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ పోలీస్స్టేషన్లో సుమారు 70 మంది పనిచేస్తుండగా.. వారం రోజుల వ్యవధిలో 12 మందికి వైరస్ సోకింది. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.