logo

పాత ఇనుము తరలిస్తున్న వాహనం పట్టివేత

రహదారి విస్తరణ పనుల్లో ఉపయోగించే ఇనుప సామగ్రిని చోరీచేసి అమ్మి సోమ్ము చేసుకుంటున్న ముఠాలను మోతె పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈనెల 19న ఈనాడులో ప్రచురితమైన ‘పేట్రేగుతున్న ముఠాలు..

Published : 22 Jan 2022 03:42 IST

వ్యాపారితో సహా 13 మంది దొంగల అరెస్టు

మోతె, న్యూస్‌టుడే: రహదారి విస్తరణ పనుల్లో ఉపయోగించే ఇనుప సామగ్రిని చోరీచేసి అమ్మి సోమ్ము చేసుకుంటున్న ముఠాలను మోతె పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈనెల 19న ఈనాడులో ప్రచురితమైన ‘పేట్రేగుతున్న ముఠాలు.. వరుస చోరీలు’ కథనంతో కదిలిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. దీంతో దొంగలు దొరికారు. కేసు వివరాలను కోదాడ డీఎస్పీ రఘు మోతె పోలీసుస్టేషన్‌లో వెల్లడించారు. ఖమ్మం నుంచి ఏపీ 24వై 4105 డీసీఎం వాహనంలో తరలిస్తున్న రూ.7 లక్షల విలువైన రోడ్డు పనుల్లో వినియోగించే ఇనుప సామగ్రిని పట్టుకున్నారు. దాని ఆధారంగా దర్యాప్తు చేయడంతో దొంగలు, వాటిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులతో సహా 14 మందిని అరెస్టు చేశారు. వంతెనల నిర్మాణ ఇనుప సామగ్రిని దొంగిలించి పక్కనే ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలోని పాత ఇనుప ఇనుము దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఈ సామగ్రిని సదరు వ్యాపారి హైదరాబాద్‌లో విక్రయించేందుకు తీసుకువెళ్తుండగా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన ఇనుము వ్యాపారి రావుల ప్రకాష్‌ పరారైనట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన పాత ఇనుము వ్యాపారి దానబోయిన నాగేశ్వర్‌రావు, హట్యాతండాకు చెందిన బదావత్‌ నాగరాజు, అనిల్‌కుమార్‌, సుధీర్‌, భాస్కర్‌, మహేందర్‌, నరేష్‌, గుగులోత్‌ సురేశ్‌ ఉన్నారు. మోతె మండలం నామవరం గ్రామానికి చెందిన బెజవాడ కోటి, వీరబోయిన మహేశ్‌, అనంతుల నరేశ్‌, రాఘవాపురానికి చెందిన దాసరి వెంకటేశ్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని