logo

మట్టపల్లిలో కల్యాణ మూర్తులకు వసంతోత్సవం

మట్టపల్లిలో నిర్వహిస్తోన్న శ్రీస్వామి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు బుధవారం కల్యాణ మూర్తులకు చూర్ణోత్సవం నిర్వహించారు. కొట్నాలు, పసుపు కొమ్ముల మిశ్రమంతో కల్యాణ మూర్తులకు నలుగు పెట్టి రుతువులన్నీ కొలువై ఉండే శుభతరుణాన్ని

Published : 19 May 2022 02:49 IST

మట్టపల్లిలో అన్తహోమం నిర్వహిస్తున్న అర్చకులు

మఠంపల్లి, న్యూస్‌టుడే: మట్టపల్లిలో నిర్వహిస్తోన్న శ్రీస్వామి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు బుధవారం కల్యాణ మూర్తులకు చూర్ణోత్సవం నిర్వహించారు. కొట్నాలు, పసుపు కొమ్ముల మిశ్రమంతో కల్యాణ మూర్తులకు నలుగు పెట్టి రుతువులన్నీ కొలువై ఉండే శుభతరుణాన్ని ఆహ్వానిస్తూ వసంతోత్సవం చేపట్టారు. ఉభయ దేవేరులను కృష్ణానదిలో జలప్రవేశం చేయించి చందనాది పరిమళ లేపనాలతో చక్రతీర్థం ఆచరించారు. ఉత్సవాల పరిసమాప్తిని సూచిస్తూ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత నృహరికి అవబృదోత్సవం చేయించారు. నవకుంభాది జలాలతో అభిషేకాలు చేశారు. సభ్యాగ్నిలో హోమాది క్రతువుల తదుపరి పూర్ణాహుతి జరిగింది. సాయంత్రం భక్తవత్సలునికి దోపు ఉత్సవంలో భాగంగా తిరుమంగయాళ్వారాదుల చరిత్రను యాజ్ఞీకులు భక్తులకు వినిపించారు. రాత్రి ధ్వజావరోహణం, మౌనబలి పూర్తయ్యాక తీర్థప్రసాద వినియోగం చేశారు. గురువారం రాత్రి ద్వాదశ సేవలు, డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌, అర్చకులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు