logo

సంప్రదాయానికి సరి కొత్త హంగులు

వివాహాది శుభకార్యాలను పదికాలాల పాటు తీపి గుర్తుగా పదిలపర్చుకోవడానికి చూపిస్తున్న ఆసక్తిని కొందరు మహిళలు అందిపుచ్చుకుని ఆర్థికంగా బాటలు వేసుకుంటున్నారు. కాలానికి అనుగుణంగా అభిరుచులు మారడం సహజం

Updated : 22 May 2022 04:08 IST

ఉపాధి పొందుతున్న మహిళా డిజైనర్లు

నల్గొండ జిల్లాపరిషత్‌, న్యూస్‌టుడే

సారె ఆలంకరించిన బుట్టలు

వివాహాది శుభకార్యాలను పదికాలాల పాటు తీపి గుర్తుగా పదిలపర్చుకోవడానికి చూపిస్తున్న ఆసక్తిని కొందరు మహిళలు అందిపుచ్చుకుని ఆర్థికంగా బాటలు వేసుకుంటున్నారు. కాలానికి అనుగుణంగా అభిరుచులు మారడం సహజం. వివాహ మహోత్సవంలో పూర్వ కాలం నుంచి పెళ్లి కుండలు, గరిక ముంత, సాన, కాడికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా అందంగా అలంకరించిన బºనం, పెళ్లి కుండలు కనువిందు చేస్తున్నాయి. పెయింటింగ్‌ చేసిన కుండలకు ఇప్పుడు మంచి ఆదరణ ఉంది. నల్గొండకు చెందిన డిజైనర్లు నోముల రుక్మిణీ, చైతన్యపురికాలనీకి చెందిన రమ్య, పాతబస్తీకి చెందిన కొయగూర ఆండాళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రజలు ఇష్టపడేలా చేతితో చేసిన డిజైన్‌ వర్క్‌, మురిపించే ఎంబ్రాయిడరీలతో కొత్త నమూనాలను ఆవిష్కరిస్తున్నారు.
ఆకట్టుకునేలా అలంకరణ
పెళ్లి వేడుకలో వాడే వస్తువులను అద్దాలు, ముత్యాలు, చెమ్కీలతో అలంకరిస్తున్నారు. వధువు, వరుడు ఒకరి కాలివేలు మరొకరు తొక్కేందుకు ఉపయోగించే సానరాయిని సైతం ఎంబ్రాయిడరీతో అలంకరిస్తున్నారు. పెళ్లికూతురు, కుమారుడి చేతిలో ఉండే గరికే ముంత, అవురేని కుండలను సైతం రంగురంగుల చెమ్కీలు, ముత్యాలతో డిజైన్‌ చేస్తున్నారు. తెరపత్రాలు, కొబ్బరి బోండం, సారే బుట్టలు, పెళ్లికూతురును మోసుకొళ్లే బుట్టను ఆకర్షణీయంగా అలంకరించడంతో వీటిపై మక్కువ పెరిగింది. జరీ, చిప్స్‌తో అలంకరించి ఎంబ్రాయిడరీ వర్క్‌తో తీర్చిదిద్దిన కుండలకు మంచి గిరాకీ ఏర్పడింది. మంగళ స్నానాల అలంకరణ, చలువ పందిళ్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. అలంకరణను బట్టి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు తీసుకుంటున్నారు. వీటిని ఆర్డర్లపై సరఫరా చేస్తున్నారు.
ప్రజల అభిరుచికి తగినట్లు..

- నోముల రుక్మిణీ, నల్గొండ
వివాహ మహోత్సవంలో ఉపయోగించే కుండలు, ఇతర వస్తువులకు అలంకరణ పని 15 ఏళ్లుగా చేస్తున్నాం. ప్రజల అభిరుచికి తగ్గటు కొత్తగా రంగులతోపాటు మిర్రర్‌ వర్కు, కుందన్‌ జరీ ఉపయోగించి సరికొత్త హంగులతో అవురేని కుండలు, బోనం కుండల అలంకరణ చేస్తూ కుటుంబ ఆర్థిక పరిపుష్టికి బాటలు వేసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని