logo

బరిలో..

లోక్‌సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్‌సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల  నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 27 Apr 2024 06:39 IST

నల్గొండలో 31
భువనగిరిలో 51

ఈనాడు, నల్గొండ: లోక్‌సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్‌సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల  నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్‌ గడువు ముగిసే నాటికి ఈ లోక్‌సభ స్థానానికి మొత్తం 56 మంది అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేయగా..ఇందులో 25 మందివి వివిధ కారణాలతో తిరస్కరణకు గురి అయ్యాయి. ప్రస్తుతం ఈ స్థానం నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 31కి చేరింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 29న సాయంత్రం ముగియనుంది. దీంతో రిజిస్టర్డ్‌, చిన్న పార్టీల నుంచి, స్వతంత్రులుగా నామినేషన్‌ వేసిన కొంత మంది అభ్యర్థులను వారి నామినేషన్‌ పత్రాలను ఉపసంహరించుకునేందుకు ప్రధాన పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

భువనగిరి లోక్‌సభ స్థానానికి మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేయగా శుక్రవారం జరిగిన నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో 10 మంది అభ్యర్థుల నామినేషన్‌లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 51 మంది నామినేషన్లు సక్రమంగా ఉండటంతో వాటికి రిటర్నింగ్‌ అధికారి హనుమంతు కే.జెండగే ఆమోదం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని