logo

ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే రైతు ఆత్మహత్యలు: వీహెచ్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వీ.హనుమంతరావు అన్నారు.

Published : 24 May 2022 04:10 IST


ఆలేరులో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వి.హనుమంతరావు, పక్కన పీసీసీ కార్యదర్శి ఉపేందర్‌రెడ్డి, తదితరులు

ఆలేరు, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వీ.హనుమంతరావు అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొంటూ సోమవారం రాత్రి ఆలేరులోని దినేష్‌ గార్డెన్స్‌లో బస చేసిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. రైతాంగంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏకకాలంలో పంట రుణాలను మాఫీ చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలనతోనే రైతు సంక్షేమం సాధ్యమన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌ విజయం తథ్యమన్నారు. పీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, పార్టీ ఆలేరు పట్టణ అధ్యక్షుడు ఎంఎ.ఎజాస్‌, ముఖ్య నాయకులు చింతలఫణి శ్రీనివాస్‌రెడ్డి, కట్టెగొమ్ముల సాగర్‌రెడ్డి, ఎం.డి.బాబా తదితరులు ఉన్నారు.

యాదగిరిగుట్ట అర్బన్‌: యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా సైదాపురం గ్రామ రైతులు వారి విలువైన భూములు కోల్పోయారని, వెంటనే వారికి న్యాయం చేయాలని వి.హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగా సోమవారం మార్గమధ్యలో సైదాపురం గ్రామ రైతులతో ఆయన మాట్లాడారు. సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఇందిరా గాంధీ పేద రైతులకు పంచిన భూమిని లాక్కోవడం అన్యాయమన్నారు. గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న 314, 329 సర్వే నెంబర్‌లలో సుమారు 90 ఎకరాల భూమిని వైటీడీఏ సేకరించడంతో పేద, సన్నకారు రైతులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆరోపించారు. నాయకులు దుంబాల వెంకట్‌ రెడ్డి, కల్వకొలను సతీష్‌ భట్‌, హరిప్రసాద్‌, మహేష్‌ యాదవ్‌, రైతులు పల్లెపాటి బిక్షపతి, కోరుకొప్పుల కృష్ణ స్వామి, పయ్యావుల పాండు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని