logo

వైద్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి

నల్గొండ ప్రభుత్వ వైద్యశాలకు ప్రసవం కోసం వెళ్లిన అఖిల మృతికి కారణమైన వైద్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Published : 26 Sep 2022 04:24 IST

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

కట్టంగూరు చెర్వుఅన్నారంలో శిశువును చేతుల్లోకి తీసుకొని

అఖిల కుటుంబీకులను పరామర్శిస్తున్న

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

కట్టంగూరు, న్యూస్‌టుడే: నల్గొండ ప్రభుత్వ వైద్యశాలకు ప్రసవం కోసం వెళ్లిన అఖిల మృతికి కారణమైన వైద్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కట్టంగూరు మండలం చెర్వుఅన్నారంలో అఖిల కుటుంబీకులను ఆదివారం పరామర్శించారు. వైద్యుల నిర్లక్ష్యమే అఖిల మృతికి కారణమని ఆరోపించారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వికటించి నలుగురు, ప్రసవం కోసం వెళ్లిన అఖిల వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతిచెందారన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో బాధితులు మృతిచెందిన ఘటనలపై, భవిష్యత్తులో ఇలాంటివి పునావృతం కాకుండా ఉండేందుకు జుడీషియల్‌ విచారణ జరిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేడి ప్రియదర్శిని, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు