చేనేతలను ఎన్నుకోరా..?
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యవసాయం తర్వాత వేల కుటుంబాలకు చేనేత వృత్తి ఉపాధి కల్పిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 72 చేనేత, 13 మరమగ్గాల సహకార సంఘాలు చట్ట ప్రకారం ఏర్పాటయ్యాయి.
ఈ నెల పదో తేదీతో ముగియనున్న గడువు
కొయ్యలగూడెంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘం భవనం
చౌటుప్పల్, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యవసాయం తర్వాత వేల కుటుంబాలకు చేనేత వృత్తి ఉపాధి కల్పిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 72 చేనేత, 13 మరమగ్గాల సహకార సంఘాలు చట్ట ప్రకారం ఏర్పాటయ్యాయి. వీటిలో 34,001 మంది సభ్యులుగా ఉన్నారు. చేనేత పారిశ్రామిక సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం ముగిసి ఐదేళ్లయింది. ఎన్నికలు నిర్వహించి నూతన పాలకవర్గాలను ఎన్నిక చేసే బదులు ప్రభుత్వం వీరినే పర్సన్ ఇన్‌ఛార్జులుగా నియమించి పదవీకాలాన్ని పొడిగిస్తుంది. 2013 ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించి ప్రస్తుతమున్న పాలకవర్గాలను ఎన్నుకున్నారు. వారి పదవీకాలం 2018 ఫిబ్రవరి పదో తేదీతో ముగిసింది. ప్రతి ఆరు నెలలకోసారి.. ఇప్పటికి పది పర్యాయాలు వీరి పదవీకాలాన్ని పొడిగిస్తూ కాలయాపన చేస్తున్నారు. గడువు ముగిసే కంటే రెండు నెలల ముందే ఓటర్ల జాబితా తయారీ, ముసాయిదా జాబితా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రకటించి నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ, పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత పర్సన్ ఇన్‌ఛార్జుల గడువు ముగిసేందుకు మరో అయిదు రోజులే మిగిలి ఉన్నా.. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు విడుదల కాలేదు. చేనేత సహకార సంఘాల ఎన్నికలు పూర్తయితేనే ఈ ప్రతినిధులతో రాష్ట్ర సమాఖ్య (టెస్కో)కు పాలకవర్గం ఎన్నిక చేసే అవకాశముంటుంది. ‘ఒక్కరి కోసం అందరు- అందరికోసం ఒక్కరు’ అనే స్ఫూర్తితో నెలకొల్పిన చేనేత, మరమగ్గాల సహకారం సంఘాలకు సమర్ధవంతమైన, దార్శనికత గల పాలకవర్గాలను ఎన్నుకునే అవకాశం చేనేత కార్మికులకు కల్పించకపోవడంతో లక్ష్యం దెబ్బతింటుంది.
ఎన్నికలు నిర్వహించిన తేదీ: 1122013
పదవీకాలం ముగిసిన తేదీ: 1022018
ఆదేశాలేమీ రాలేదు..
సోమిడి ద్వారక్, ఏడీ, చేనేత- జౌళి శాఖ, నల్గొండ
చేనేత సహకార సంఘాల పర్సన్ ఇన్‌ఛార్జుల పదవీకాలం ఈనెల పదో తేదీతో ముగుస్తుంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా మాకేమీ ఆదేశాలు అందలేదు. ప్రస్తుతమున్న పర్సన్ ఇన్‌ఛార్జులతోనే సహకార సంఘాల నిర్వహణ జరుగుతుంది. ప్రభుత్వ పథకాలు సహకార, స్వయం సహాయక సంఘాల, సహకారేతర సభ్యులకు అమలు చేస్తున్నాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ram Ramapati Bank: శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
Ts-top-news News
Summer: మండే వరకు ఎండలే.. ఏడు జిల్లాలకు హెచ్చరికలు
-
Crime News
Andhra News: సీఎం జగన్పై పోస్టులు పెట్టారని ప్రవాసాంధ్రుడి అరెస్టు
-
Crime News
Vijayawada: వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి
-
India News
Nirmala Sitharaman: చిన్నారి మోములో చిరునవ్వు కోసం..
-
Ap-top-news News
Vande Bharat Express: 8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి.. వందేభారత్ టైమింగ్స్ ఇలా...