logo

67 ఏళ్లలో 69 శాతమే!

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి

Published : 19 Apr 2024 06:05 IST

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో మందకొడిగా పోలింగ్‌

 మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి. అప్పటి నుంచి పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అయినా 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో 55.31శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2019లో జరిగిన చివరి ఎన్నికల్లో కేవలం 69.84శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. ఓటర్లలో నిర్లక్ష్యం, ఎన్నికల పై అలసత్వం కారణంగానే పోలింగ్‌ శాతం పెరగట్లేదని ప్రజాస్వామ్య వాదులు వాపోతున్నారు.

 2009లో 74.13 శాతం పోలింగ్‌..

 17 సార్లు లోక్‌సభకు ఎన్నికలు జరుగగా 2009లో అత్యధికంగా 74.13శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 1957లో జరిగిన రెండో ఎన్నికల్లో అత్యల్పంగా 54.03శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. 2014లో 74.10శాతం పోలింగ్‌ అయింది. 2009 ఎన్నికల్లో మొత్తం 14,55,016 ఓట్లు ఉండగా.. 10,78,698 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో 16,75,388 మంది ఓటర్లు ఉండగా.. 11,70,143 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం 17,18,954 మంది ఓటర్లు ఉండగా.. ఈ సంఖ్య పెరగనుంది. ఓటర్ల సంఖ్యతో పాటు పోలింగ్‌ శాతాన్ని సైతం పెంచేందుకు అధికారులు అన్ని రకాలు చర్యలు చేపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని