logo

ఒకేసారి గెలిచిన ఇద్దరు యోధులు

1991లో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు.

Published : 30 Apr 2024 05:20 IST

బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డి

1991లో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్‌ రాష్ట్రం నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతుంటే నైజాం నిరంకుశ పాలన నుంచి పేదలకు భూమి, భుక్తి, విముక్తి కల్పించేందుకు ఈ ఇద్దరూ అజ్ఞాతంలో ఉంటూ కమ్యూనిస్టు సాయుధ గెరిల్లా దళాలకు నాయకత్వం వహించి పోరు సాగించారు. సాయుధ పోరులో కలిసి నడిచిన యోధులిద్దరికీ మళ్లీ ఒకేసారి శాసనసభ, లోక్‌సభలో ప్రజా ప్రతినిధులుగా పోరాడే అవకాశం లభించింది. 1957లో నకిరేకల్‌, తుంగతుర్తి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1991లో నల్గొండ నుంచి ధర్మభిక్షం, మిర్యాలగూడ నుంచి భీమిరెడ్డి ఎంపీలుగా విజయం సాధించారు. శాసనసభ, లోక్‌సభ సమావేశాలకు నూలు పంచె కట్టుకుని, లాల్చీ తొడుక్కుని సాదాసీదాగా బస్సులోనే వెళ్లేవారు. ఇద్దరూ సుదీర్ఘ కాలం చట్టసభల సభ్యులుగా ఉన్నా సొంత ఆస్తులేమీ కూడబెట్టుకోలేదు. నైజాం పాలన అంతమయ్యాక ధర్మభిక్షం 1952లో సూర్యాపేట, 1957లో నకిరేకల్‌, 1962లో నల్గొండ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా, 1991, 1996 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. భీమిరెడ్డి 1957లో సూర్యాపేట, 1967లో తుంగతుర్తి ఎమ్మెల్యేగా, 1971, 1984, 1991 ఎన్నికల్లో మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆదర్శంగా నిలిచారు.  

న్యూస్‌టుడే, చౌటుప్పల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని