logo

వర్షాలకు రూ.80 లక్షల నష్టం: ఎస్‌ఈ

అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్తు శాఖకు రూ.80 లక్షల వరకు నష్టం జరిగినట్లు ఆ శాఖ ఎస్‌ఈ పాల్‌రాజు తెలిపారు.

Published : 08 May 2024 03:35 IST

భానుపురి, న్యూస్‌టుడే: అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్తు శాఖకు రూ.80 లక్షల వరకు నష్టం జరిగినట్లు ఆ శాఖ ఎస్‌ఈ పాల్‌రాజు తెలిపారు. సూర్యాపేటలోని ఎస్‌ఈ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈదురుగాలులకు ఎల్టీ స్తంభాలు 192 ధ్వంసం కాగా ఇప్పటి వరకు 86 స్తంభాలు మార్చామన్నారు. 106 స్తంభాలను రెండ్రోజుల్లో మారుస్తామని చెప్పారు. 11 కేవీ విద్యుత్తు స్తంభాలు 124 కూలిపోయాయని, 60 స్తంభాలు మార్చగా మరో 64 స్తంభాలు మార్చాల్సి ఉందన్నారు. జిల్లాలో అకాల వర్షం, పిడుగుపాటుకు మూడు ఉపకేంద్రాలు తప్ప ఏవీ కూడా పని చేయలేదని, రాత్రి 10 గంటల వరకు మరమ్మతు చేపట్టి కరెంటు సరఫరాను పునరుద్ధరించామని చెప్పారు. ముఖ్యంగా ఆత్మకూర్‌(ఎస్‌) నుంచి మద్దిరాల సబ్‌స్టేషన్‌ వరకు 38 స్తంభాలు కూలి వాటి ఫీడర్లు కూడా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. వాటికి కూడా మరమ్మతు చేపట్టి సరఫరా చేశామన్నారు. పనుల పర్యవేక్షణకు ముగ్గురు ప్రత్యేక సిబ్బందిని ఉన్నతాధికారులు నియమించారని, వారు ఎప్పటికప్పుడు సరఫరా, మరమ్మతు విషయమై పర్యవేక్షణ చేపడుతున్నారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 14 ఫీడర్లకు గాను 13 ఫీడర్లు పిడుగుపాటుకు మరమ్మతుకు గురయ్యాయని, మునగాల మండల పరిధిలో నాలుగు ఫీడర్లు ధ్వంసమయ్యాయని, వాటికి మరమ్మతు చేపట్టినట్లు వివరించారు. సమావేశంలో డీటీ దాలినాయుడు, డీఈ శ్రీనివాస్‌, ఏఈడీ ఉదయ్‌కుమార్‌, సిబ్బంది రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు