logo

26 రోజుల పోరాటం.. 22 రోజులకు ఫలితం

లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల పాట్లు మామూలుగా లేవు. నెలన్నర పాటు ఎన్నికల ప్రక్రియ నడవడం వారికి పరీక్షా సమయంగా మారింది.

Published : 08 May 2024 03:51 IST

హుజూర్‌నగర్‌, హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల పాట్లు మామూలుగా లేవు. నెలన్నర పాటు ఎన్నికల ప్రక్రియ నడవడం వారికి పరీక్షా సమయంగా మారింది. అసలే రికార్డు స్థాయిలో ఎండలు మండుతున్నా.. బరిలో దిగిన నేతలు మడమ తిప్పకుండా వడదెబ్బ తగిలినా ఒక పూట, అరపూట విశ్రాంతి తీసుకుని ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతూనే ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ ఇంత దూరం ఏంటని ప్రశ్నించిన అభ్యర్థులు కూడా ఉన్నారు. నామినేషన్లు వేసిన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు 48 రోజులు అభ్యర్థులకు, చోటామోటా నాయకులకు ఉత్కంఠ తప్పనిసరైంది. ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 25తో నామినేషన్‌ దాఖలు గడువు ముగిసింది. 26న పరిశీలన, 29న ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. తుది జాబితా ఖరారు చేశారు. అప్పటి నుంచి అభ్యర్థుల ప్రచార పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంది. ఎండలు ఉండి గ్రామాలన్నీ తిరగలేకపోయినా.. మండల, పట్టణ మీటింగ్‌లు, రోడ్‌షోలు, జాతీయ, రాష్ట్ర నేతల పర్యటనలు.. వారికి ఏర్పాట్లు, జనసమీకరణ, మరో వైపు క్షేత్రస్థాయిలో నాయకులను సమన్వయం చేసుకోవడం నిత్యం పోరాటంలా నడుస్తుంది. ఇక పోలింగ్‌ ఈనెల 13న జరగనుంది. పోలింగ్‌ తరువాత 22 రోజులకు అంటే జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటి వరకు అభ్యర్థులు రోజూ అంచనాలు వేస్తూ, ద్వితీయశ్రేణి నాయకులతో పోలింగ్‌ జరిగిన తీరు తెలుసుకొని గెలుపోటములపై చర్చలు జరుపుతూ 22 రోజుల పాటు ఉత్కంఠగా గడపాల్సిందే మరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు