logo

ఓటు వేసేందుకు గుర్తింపుకార్డు తప్పనిసరి

లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి గుర్తుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు.

Published : 08 May 2024 04:03 IST

నల్గొండ సంక్షేమం: లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి గుర్తుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు కార్డుల్లో ఆధార్‌కార్డు, మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ జాబ్‌కార్డు, బ్యాంకు లేదా పోస్టాఫీసులు ఫొటోతో సహా జారీచేసిన పాస్‌బుక్‌, కేంద్ర కార్మికశాఖ ద్వారా జారీ చేయబడిన ఆరోగ్యభీమా స్మార్టుకార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు ఆర్టీఐ ఎన్‌పీఆర్‌ కింద జారీ చేసిన స్మార్టుకార్డు, ఇండియన్‌ పాస్‌పోర్టు ఫొటో కలిగిన పెన్షన్‌ డాక్యుమెంట్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్‌ సెక్టార్‌ అండ్‌ టేకింగ్‌ సంస్థలు, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపనీలు వారి ఉద్యోగులకు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు, కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వశాఖ జారీ చేసిన యూనిక్‌ దివ్యాంగ కార్డులలో ఏదో ఒకటి గుర్తింపుగా చూపించి ఓటు  హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.

నల్గొండ సంక్షేమం: కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాంతో పాటు సింబల్‌ లోడెడ్‌ యూనిట్‌ స్టోరేజ్‌లను జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన పరిశీలించారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి నటరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

‘8, 9 తేదీల్లో మూడో విడత శిక్షణ... నల్గొండ సంక్షేమం: రెండో విడత శిక్షణ కార్యక్రమాలకు హాజరైన పీఓ, ఏపీఓలకు ఈ నెల 8, 9 తేదీల్లో మూడో విడత శిక్షణ కార్యక్రమాలు రెండు విడతలుగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు.  పీఓ, ఏపీఓలు తప్పనిసరిగా ఈ శిక్షణ కార్యక్రమాలకు హాజరుకావాలని కోరారు. శిక్షణ కార్యక్రమాలను ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్‌ సక్రమ నిర్వహణ, మాక్‌ పోలింగ్‌ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు