logo

ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలి

ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, ఎన్నికల నిబంధనలను అతిక్రమించకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అబ్జర్వర్ నవీన్ షైనీ.. (IPS) నిఘా బృందాలను హెచ్చరించారు.

Updated : 10 May 2024 17:11 IST

భువనగిరి: ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, ఎన్నికల నిబంధనలను అతిక్రమించకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అబ్జర్వర్ నవీన్ షైనీ.. (IPS) నిఘా బృందాలను హెచ్చరించారు. శుక్రవారం ఆయన భువనగిరి, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి విస్త్రత తనిఖీలు నిర్వహించారు. బీబీనగర్ మండలం గూడూర్ చెక్ పోస్ట్, రాఘవాపురం క్రిటికల్ పోలింగ్ స్టేషన్, పోచంపల్లి మండలం కపరాయిపల్లి క్రిటికల్ పోలింగ్ స్టేషన్, చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట వద్ద స్టాటిస్టికల్ సర్వైలైన్స్ చెక్‌పోస్ట్, తూప్రాన్ పేట క్రిటికిల్ పోలింగ్ స్టేషన్, పంతంగి చెక్ పోస్టు, చిట్యాల జిల్లా పరిషత్ హైస్కూల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్, నార్కట్ పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్‌లను ఆయన తనిఖీ చేశారు. రిజిష్టర్లలోని వివరాలను పరిశీలించారు. వాహనాలను పూర్తిగా చెక్ చేయాలని, నిబంధనల కన్నా ఎక్కువ ఉన్న నగదు  జాగ్రత్తగా పరిశీలించి సీజ్ చేయాలని, డ్రగ్స్, గంజాయి రవాణను పకడ్బందీగా అరికట్టాలని, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని రకాలుగా పఠిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏసీపీ మధుసూదన్ రెడ్డి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, లైజనింగ్ అధికారి శ్యాంసుందర్, పోలీసు అధికారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు