logo

‘వైకాపా పాలనలో అన్ని వర్గాలకు న్యాయం’

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి మంత్రులు, శాసనసభ్యులు ప్రజల్లోకి వెళుతుండటం ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పొదలకూరు మండలం విరువూరులో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated : 23 May 2022 04:50 IST

పశువైద్య వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న కాకాణి

పొదలకూరు, న్యూస్‌టుడే: గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి మంత్రులు, శాసనసభ్యులు ప్రజల్లోకి వెళుతుండటం ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పొదలకూరు మండలం విరువూరులో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కొందరు పక్కాఇళ్లు, పింఛను వంటివి అవసరమని మంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే అధికారులకు చెప్పి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 ఏళ్లు జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పాలిస్తారనీ, రాష్ట్రంలో తెదేపా కనుమరుగైనట్లేనన్నారు. 2024 ఎన్నికల్లో తెదేపా వైపు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదన్నారు. వ్యవసాయంతోపాటు పశుసంపదను పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని 175నియోజకవర్గాలకు వైఎస్సార్‌ సంచార పశుఆరోగ్య సేవా వాహనాన్ని కేటాయించినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకొని దానిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. మాజీ సర్పంచి బచ్చల సురేశ్‌కుమార్‌రెడ్డి విరువూరు గ్రామస్థులకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తెచ్చి తీరుస్తుండంటంపై సురేశ్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. తొలుతా పశుసంచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. వైకాపా నాయకులు బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, దశకంఠాద్రిశర్మ, కొల్లి రాజగోపాల్‌రెడ్డి, శ్రీనివాసులు, ఎంపీపీ సుబ్బరాయుడు, పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని