logo

అధికారులపై కేంద్ర బృందం సభ్యుల ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై పొంతన లేని వివరాలు చెప్పడంతో కేంద్ర బృందం సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 09 Feb 2023 01:22 IST

మాట్లాడుతున్న అంబటి శ్రీనివాస్‌

బిట్రగుంట, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై పొంతన లేని వివరాలు చెప్పడంతో కేంద్ర బృందం సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బోగోలు మండలంలోని జక్కేపల్లిగూడూరులో జాతీయ స్థాయి మూల్యాంకన కమిటీ ప్రన్సిపల్‌ కోఆర్డినేటర్‌ అంబటి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాల అమలుపై గ్రామసభ నిర్వహించారు. పీఎం కిసాన్‌, ఉపాధి హామీ పథకం, జల్‌జీవన్‌మిషన్‌, మాతృవందన పథకం, పింఛన్లు తదితర వాటిపై లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా పథకాల వివరాలను అధికారులు చెప్పలేకపోయారు. దీంతో వారిపై మండిపడ్డారు. అంబటి శ్రీనివాస్‌ను న్యూస్‌టుడే వివరణ కోరగా తాము గుర్తించిన సమాచారాన్ని వెల్లడించమని, కేంద్రానికి నివేదిస్తామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని