logo

పిడుగుపాటుకు బాలుడి మృతి

ఉరుములు, మెరుపులతో అకాల వర్షానికి పిడుగు పడి ఆవుల నాని(10) అనే బాలుడు మృత్యువాత పడిన సంఘటన బ్రాహ్మణక్రాక వద్ద కాకమ్మ చెరువు సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది.

Updated : 24 Mar 2023 06:18 IST

జలదంకి, న్యూస్‌టుడే: ఉరుములు, మెరుపులతో అకాల వర్షానికి పిడుగు పడి ఆవుల నాని(10) అనే బాలుడు మృత్యువాత పడిన సంఘటన బ్రాహ్మణక్రాక వద్ద కాకమ్మ చెరువు సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. వీఆర్వో బాలకోటయ్య తెలిపిన వివరాల మేరకు... మనుబోలు మండలంలోని మడమనూరుకు చెందిన ఆవుల శ్రీనివాసులు, అల్లూరమ్మ దంపతుల కుమారుడు నాని మండలంలోని బ్రాహ్మణక్రాక గిరిజన కాలనీలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికొచ్చాడు. గురువారం ఉదయం తాత దేవరకొండ మాలకొండయ్యతో కలసి బాతులను మేపేందుకు సమీపంలోని కాకమ్మ చెరువు వద్దకెళ్లాడు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పెద్ద శబ్దంతో చెరువు సమీపంలో పిడుగు పడటంతో ఒక్కసారిగా ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. కొంత సమయానికి తాత కోలుకోగా.. మనుమడు ఆవుల నాని సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు