logo

ఓడరేవు పనులు త్వరగా పూర్తి చేయాలి

రామాయపట్నం ఓడరేవు పనులను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్‌ అధికారులను ఆదేశించారు.

Published : 30 Mar 2023 03:46 IST

అధికారులతో సమీక్షిస్తున్న పరిశ్రమలశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్‌

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: రామాయపట్నం ఓడరేవు పనులను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ శోభికతో కలిసి ఓడరేవు పనులు, తెట్టు వద్ద ప్రతిపాదించిన విమానాశ్రయం భూసేకరణ పనులు, పునరావాస చర్యలపై అధికారులతో సమీక్షించారు. వలవన్‌ మాట్లాడుతూ.. ఓడరేవుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని, ప్రధానంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. అటవీ భూములను అన్ని అనుమతులతో సేకరించి.. అందించాలన్నారు. విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణపైనా చర్చించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖాధికారి ఎ.చంద్రశేఖర్‌, పరిశ్రమల కేంద్రం జీఎం మారుతిప్రసాద్‌, కావలి ఆర్డీవో శీనానాయక్‌, ఓడరేవు అభివృద్ధి సంస్థ ఎండీ పి.ప్రతాప్‌, జీఎం నరసింహారావు, ఏపీఏడీఏ సీఈవో నీరజ్‌, తహసీల్దారు సీతారామయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని