కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికీ దాని గురించి పట్టించుకోవడం లేదని మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం పేర్కొన్నారు.
మాట్లాడుతున్న మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం
నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికీ దాని గురించి పట్టించుకోవడం లేదని మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం పేర్కొన్నారు. మంగళవారం జిల్లాకు చేరిన మున్సిపల్ కార్మికుల ప్రచారజాతకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలనీ, సీపీఎస్ రద్దు చేసి పాతపెన్షన్ ఇవ్వాలని కోరారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్, రాష్ట్ర నాయకులు నాగేంద్రబాబు, నాగరాజు, గోపి, లక్ష్మీనారాయణ, ఆదినారాయణ, జిల్లా కార్యదర్శి కొండా ప్రసాద్, కుమార్, సుజాతమ్మ, దేశమూర్తి, వజ్రమ్మ, సీఐటీయూ నాయకులు బత్తల కృష్ణయ్య పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.