logo

ఇద్దరు వాలంటీర్లు, క్షేత్ర సహాయకుడి తొలగింపు

నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఒక క్షేత్రసహాయకుడిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్వో ఓబులేసు తెలిపారు.

Published : 28 Mar 2024 04:35 IST

కాకాణి ఎన్నికల ప్రచారంలో వాలంటీరు దామోదర్‌
తోటపల్లిగూడూరు, పొదలకూరు, న్యూస్‌టుడే: నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఒక క్షేత్రసహాయకుడిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్వో ఓబులేసు తెలిపారు. తోటపల్లిగూడూరు మండలం ముంగలదొరువు, సౌత్‌ఆములూరు గ్రామాల్లో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సౌత్‌ఆములూరు వాలంటీర్లు నంబూరు దామోదర్‌, నిమ్మలప్రసాద్‌, ముంగలదొరువులో ఉపాధిహామీ పథకం క్షేత్రసహాయకుడు కోనేటి రాజు పాల్గొన్నట్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలో వారిని తొలగించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు.   ః పొదలకూరు కేకేఆర్‌ నగర్‌ పరిధిలోని ఆశా కార్యకర్తలు సర్వేపల్లి వైకాపా అభ్యర్థి కాకాణి కుమార్తెతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దానిపై అధికారులు స్పందించారు. ఎంపీడీవో మహ్మద్‌ రఫి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహ్మదాపురం వైద్యాధికారి విచారణ అనంతరం ఆశా కార్యకర్తలు చైతన్య, సుమలతలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని