logo

అగ్రిగోల్డ్‌ భూముల్లోని కలప అక్రమ రవాణా

మండలంలోని రాచవారిపల్లి- తురకపల్లి మార్గంలో సుమారు 200 ఎకరాల్లో అగ్రిగోల్డ్‌ భూముల్లోని కలపను అక్రమార్కులు తరలిస్తుండగా స్థానికులు గుర్తించారు.

Published : 30 Apr 2024 04:31 IST

వాహనంతో సహా పరార్‌ 

లారీల్లో ఎక్కిస్తున్న జామాయిల్‌

దుత్తలూరు, న్యూస్‌టుడే : మండలంలోని రాచవారిపల్లి- తురకపల్లి మార్గంలో సుమారు 200 ఎకరాల్లో అగ్రిగోల్డ్‌ భూముల్లోని కలపను అక్రమార్కులు తరలిస్తుండగా స్థానికులు గుర్తించారు. సోమవారం భూముల్లోని జామాయిల్‌ కలపను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్థులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్రమార్కులను నిలదీయడంతోపాటు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమార్కులు లారీతో సహా పరారయ్యారు. కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకులే ఈ అక్రమ రవాణా గత కొన్ని నెలలుగా చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ. 40 లక్షల మేర విలువైన కలప అక్రమ రవాణా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

చర్యలు తీసుకోవాలి.. కొండారెడ్డి, స్థానికుడు

కొంత కాలంగా అగ్రిగోల్డ్‌ భూముల్లో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటి వరకు సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ప్రతి వారం మూడు నుంచి ఐదు వాహనాల్లో కలప అక్రమంగా తరలివెళుతోంది. ఈ అక్రమ రవాణాతో కొంతమంది స్థానికులు రూ. లక్షలు సంపాదిస్తున్నారు. ఇప్పటికే అగ్రిగోల్డ్‌ భూముల్లో చాలా కలప అక్రమార్కుల పాలైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ రవాణా చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని