logo

ప్రశాంత ఎన్నికలకు చర్యలు

ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్‌ మిశ్రా ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై మంగళవారం నగరపాలకసంస్థలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటరులో పోలీసు అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు.

Published : 08 May 2024 06:35 IST

రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్‌ మిశ్రా

మాట్లాడుతున్న రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్‌ మిశ్రా  

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే:  ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్‌ మిశ్రా ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై మంగళవారం నగరపాలకసంస్థలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటరులో పోలీసు అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా పోలీసులు పని చేయాలని.. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లకు భద్రత కల్పించాలన్నారు. కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ మాట్లాడుతూ జిల్లాలో 2,470 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ ఆరిఫ్‌ జిల్లాలో 450 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయన్నారు. ముందుగా కమాండ్‌ కంట్రోల్‌ రూములో జరుగుతున్న కార్యక్రమాలు పరిశీలించారు. సమావేశంలో జిల్లా ప్రత్యేక పోలీసు పరిశీలకులు అశోక్‌ టి దూదే, గుంటూరు రేంజ్‌ ఐజీ స్వర్ణశ్రేష్ట త్రిపాటలి, నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, రూరల్‌ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, కావలి, ఆత్మకూరు, కందుకూరు డీఎస్పీలు ప్రసాదు, కోటారెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు