logo

వలేటివారిపాలెం బాధలు వర్ణనాతీతం

మండలంలో సమస్యలు తిష్ఠ వేశాయి. తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, దెబ్బతిన్న రహదారులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 10 May 2024 04:35 IST

వలేటివారిపాలెం: మండలంలో సమస్యలు తిష్ఠ వేశాయి. తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, దెబ్బతిన్న రహదారులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేకునాంపురంలో ఆర్వోప్లాంటుకు విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో అధికారులు సరఫరా నిలిపేశారు. సుమారు 8 నెలలుగా  మూతపడటంతో స్థానికులు 20లీటర్లను రూ.10లకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.  రాళ్లపాడు ప్రాజెక్టు ఎడమ కాలువ పొడిగింపు పనులు 2012 నుంచి ముందుకు సాగకపోవడంతో శాఖవరం, నలదలపూరు, కళవళ్ల సాగునీటి చెరువులకు నీటి సరఫరా కలగానే మిగిలింది. పోకూరులో రెండో పీహెచ్‌సీ భవనానికి రూ.2.40కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అతీగతి లేదు. ప్రభుత్వం వైద్యుల నియామకం చేపట్టినా వైద్యులు మండల కేంద్రానికే పరిమితమయ్యారు.

  • వలేటివారిపాలెం, అంకభూపాలపురం రోడ్డుకు రూ.20లక్షలు మంజూరయినా నేటికీ పనులు ప్రారంభించలేదు.
  • కాకుపాలెం నుంచి పోకూరుకు వయా శింగమనేనిపల్లె మీదుగా గ్రావెల్‌ రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో కాకుపాలెం, కొండారెడ్డిపాలెం, నలదలపూరు, కలవళ్ల ప్రజలు కందుకూరు మీదుగా మండల కేంద్రానికి వెళ్తున్నారు
  • వాటర్‌షెడ్డు పథకం కింద చుండి, అమ్మపాలెం, పోలినేనిపాలెంలో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాలకు మరమ్మతలు చేయలేదు.
  • సంపద సృష్టి కేంద్రాలను వినియోగంలోకి తీసుకురాలేదు.

లింగసముద్రంలో రోడ్లపై మురుగునీరు

లింగసముద్రం : లింగసముద్రంలో పలు సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. మురుగుకాలువలు, చెత్తకేంద్రం లేక అవస్థలు పడుతున్నారు.
శ్మశానవాటిక లేక.. ఎవరైనా చనిపోతే చెరువుకట్టపై ఖననం  చేస్తున్నారు.

  • డంపింగ్‌యార్డు గ్రామానికి దూరంగా నిర్మించడం వల్ల చెత్తను గ్రామ సమీపంలో వేస్తున్నారు. దీంతో ఇక్కడ పందుల సంచారం అధికంగా ఉంది. అంటువ్యాధులు ప్రబలుతున్నాయి.
  • మురుగునీటి సరిగా కాలువలు లేవు. దీంతో ఇళ్లలోని మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు రహదారుల వెంట నడిచే వీల్లేదు.
  • విద్యుత్తు సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడి వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
  • ట్యాంక్‌ను 15 రోజులకు శుభ్రం చేయాల్సి ఉంది. కానీ, నెలల తరబడి పట్టించుకోకపోవడంతో తాగునీరు కలుషితమవుతోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు