logo
Published : 02/12/2021 05:47 IST

ప్రభుత్వ భూమి కబ్జా

కార్పొరేటర్‌ హరూన్‌ఖాన్‌పై కేసు

సొంత పార్టీ నేతలే ఫిర్యాదు

భూమిని పరిశీలిస్తున్న అధికారులు, ఎంఐఎం నేతలు

ఈనాడు, నిజామాబాద్‌: ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన నిజామాబాద్‌ నగరపాలక సంస్థ 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ హరూన్‌ఖాన్‌(ఎంఐఎం)పై కేసు నమోదైంది. సారంగపూర్‌ శివారు 249 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిని యంత్రాలతో చదును చేస్తున్నారు. ఈ విషయంలో సొంత పార్టీకే చెందిన డిప్యూటీ మేయర్‌ ఇద్రిస్‌ఖాన్‌, పలువురు కార్పొరేటర్లు బుధవారం కలెక్టర్‌ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించి.. నార్త్‌ ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ మధు, సౌత్‌ తహసీల్దార్‌ ప్రసాద్‌ను సదరు స్థలానికి పంపారు. ఈ సమయంలో అక్కడ జేసీబీతో నేలను చదును చేయడాన్ని గుర్తించారు. సీజ్‌ చేసిన జేసీబీ కార్పొరేటర్‌ పేరుపై ఉన్నట్లు ధ్రువీకరించుకున్నారు. అనంతరం ఆరో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కార్పొరేటర్‌పై కేసు నమోదు చేశారు.

* 249 సర్వే నంబరులో 85.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు చెబుతున్నారు. జైళ్లశాఖకు చెందిన భూమిలో ఉన్న గుట్ట ప్రాంతాన్ని చదును చేసే పనులను హరూన్‌ఖాన్‌ గుత్తా తీసుకున్నారు. ఈ పనులు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లుగా మారుస్తున్నారని సొంత పార్టీ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిని ఇతరులకు విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు ఆరోపించారు. ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ మధు మాట్లాడుతూ.. అరెకరం మేర ప్రభుత్వ భూమిని చదును చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ‘విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడంతో పాటు ప్రభుత్వ భూమిలోకి చొరబడి కబ్జా చేసేందుకు ప్రయత్నించినందుకు గాను 447, 427, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ రవి తెలిపారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని