logo
Published : 03/12/2021 03:18 IST

అక్రమ నియామకాలు రద్దు చేయాలి

దక్షిణ ప్రాంగణం ప్రిన్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలో కూర్చున్న పరిశోధక విద్యార్థి గణేశ్‌

భిక్కనూరు, న్యూస్‌టుడే: తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణం ఫిజిక్స్‌ విభాగంలో అక్రమంగా చేపట్టిన ఒప్పంద బోధనా సిబ్బంది నియామకాలు రద్దు చేయాలని డిమాండు చేస్తూ పరిశోధక విద్యార్థి గణేశ్‌ గురువారం నిరాహార దీక్ష చేపట్టారు. దక్షిణ ప్రాంగణంలో ప్రిన్సిపల్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షకు విద్యార్థులు మద్దతు తెలిపారు. 2019లో నోటిఫికేషన్‌ లేకుండా ముగ్గురు కాంట్రాక్ట్‌ అకడమిక్‌ కన్సల్టెంట్లను నియమించారని ఆరోపించారు. దీనిపై గతంలో హైకోర్టును ఆశ్రయించగా నోటీసులు పంపిందన్నారు. ఇంతవరకు వాటిపై స్పందన లేదన్నారు. వారిని తొలగించి యూజీసీ నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టే వరకు నిరాహార దీక్ష విరమించనని పేర్కొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని