logo

వేగంగా ధాన్యం డబ్బుల చెల్లింపు

వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు నగదు చెల్లింపుల ప్రక్రియ జిల్లాలో వేగంగా కొనసాగింది. ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మా, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో 458 కేంద్రాల

Published : 15 Jan 2022 03:16 IST

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు నగదు చెల్లింపుల ప్రక్రియ జిల్లాలో వేగంగా కొనసాగింది. ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మా, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో 458 కేంద్రాల ద్వారా 89,413 మంది రైతుల నుంచి 6.86 లక్షల మె.ట ధాన్యం కొన్నారు. వాటి విలువ రూ.1340.05 కోట్లు కాగా రూ.1338.21 కోట్ల వరకు అన్నదాతలకు చెల్లింపులు పూర్తి చేశారు. అధికారులు అనుకున్న దాని కంటే లక్ష మె.ట ఎక్కువగా వచ్చింది. కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నిజామాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ‘కమ్మర్‌పల్లి ప్రాంతానికి చెందిన 200 మంది అన్నదాతల వివరాలు ట్యాబ్‌లో నమోదు చేసినా సాంకేతిక సమస్యలు వచ్చాయి. రూ.1.84 కోట్ల బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని’ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ అభిషేక్‌ సింగ్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని