logo

పల్లెప్రగతి పరిశీలనకు సీఎంవో బృందం

పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అమలు తీరును తెలుసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ నెలాఖరులోపు జిల్లాలో సీఎంవో బృందం పర్యటించే అవకాశాలున్నాయి. గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్లు సమాచారం

Published : 28 Jun 2022 06:41 IST

ఒకట్రెండు రోజుల్లో జిల్లా పర్యటన

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి : పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అమలు తీరును తెలుసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ నెలాఖరులోపు జిల్లాలో సీఎంవో బృందం పర్యటించే అవకాశాలున్నాయి. గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్లు సమాచారం. ఈ బృందంలో సీఎం ప్రత్యేక కార్యదర్శితో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖల అధికారులున్నట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన జిల్లా యంత్రాంగం పల్లెప్రగతిలో నిర్దేశిత పనులను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది.  

నివేదికల తయారీలో నిమగ్నం : ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల అధికారులు నివేదికల తయారీలో నిమగ్నమయ్యారు. ఇటీవల జిల్లాలో కేంద్ర బృందం పర్యటించిన సమయంలో ఉపాధి పనులకు సంబంధించిన ఏడు రిజిస్టర్లు కోరారు. అందుబాటులో లేవనడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో అన్ని రకాల రికార్డులు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆయా విభాగాల సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని