logo

600 కిలోల గంజాయి పట్టివేత

మోతుగూడెం పోలీస్‌స్టేషన్‌ చెక్‌పోస్టు వద్ద రెండు వేర్వేరు ఘటనల్లో రూ.18 లక్షల విలువైన 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు మోతుగూడెం ఎస్సై వాసంశెట్టి సత్తిబాబు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.

Published : 13 Aug 2022 06:28 IST

పట్టుబడిన గంజాయి, వాహనాలు, నిందితులతో పోలీసులు

మోతుగూడెం, న్యూస్‌టుడే: మోతుగూడెం పోలీస్‌స్టేషన్‌ చెక్‌పోస్టు వద్ద రెండు వేర్వేరు ఘటనల్లో రూ.18 లక్షల విలువైన 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు మోతుగూడెం ఎస్సై వాసంశెట్టి సత్తిబాబు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మోతుగూడెం పోలీస్‌స్టేషన్‌ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ముందుగా చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సుకుమామిడి గ్రామం నుంచి హైదరాబాద్‌కు ట్రక్కులో చేపల బాక్సుల మాటున 16 సంచుల్లో తరలిస్తున్న 400 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రంగారెడ్డి జిల్లాకు చెందిన నసీర్‌ అలీ, ఒడిశా రాష్ట్రం పప్పులూరు పంచాయతీలోని రాసబెడకు చెందిన సను ఖిలాను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. మరో ఘటనలో కారు, ద్విచక్రవాహనాలపై సీలేరు సమీపంలోని వలసగెడ్డ నుంచి కామారెడ్డికి తరలిస్తున్న 200 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో కామారెడ్డి జిల్లాకు చెందిన భుక్యా ప్రవీణ్‌, నూకల మహేష్‌ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి ట్రక్కు, కారు, ద్విచక్ర వాహనం, నాలుగు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రంపచోడవరం కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై తెలిపారు. తనిఖీల్లో ఏఎస్సైలు పట్టాభిరామయ్య, సత్తిబాబు, హెడ్‌ కానిస్టేబుళ్లు నాగేశ్వరరావు, రవిచంద్ర, సోమరాజు, ప్రసాద్‌, రాజేశ్వరరావు, సన్యాసిరావు, కానిస్టేబుళ్లు దుర్గ, రబ్బాని, సీఆర్పీఎఫ్‌ 42 బెటాలియన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని