logo

విద్యార్థి పౌష్టికాహారంలో కోతలు

మార్కెట్‌లో నిత్యావసర సరకుల ధరలు నేడు ఎలా ఉన్నాయో నెల తిరిగే సరికి ఎలా ఉంటాయో తెలియడం లేదు. దీంతో ప్రతినెల కిచెన్‌ బడ్జెట్‌ ప్రణాళిక మార్చుకోవాల్సి వస్తోంది.

Published : 06 Feb 2023 05:49 IST

నిత్యావసర సరకుల ధరలకు రెక్కలతో తంటా 
వసతిగృహాల్లో ఆరేళ్ల నాటి మెస్‌ఛార్జీలే అమలు
న్యూస్‌టుడే, నందిపేట్‌

మార్కెట్‌లో నిత్యావసర సరకుల ధరలు నేడు ఎలా ఉన్నాయో నెల తిరిగే సరికి ఎలా ఉంటాయో తెలియడం లేదు. దీంతో ప్రతినెల కిచెన్‌ బడ్జెట్‌ ప్రణాళిక మార్చుకోవాల్సి వస్తోంది.

ప్రభుత్వ వసతి గృహాల్లో  విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఏళ్లుగా మెస్‌ఛార్జీల ధరల్లో మార్పు రావడం లేదు. ఆ డబ్బులు సరిపోక భోజనంలో కోత పెడుతున్నారు.

వసతి గృహాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సర్కారు ఆరేళ్ల క్రితం మెస్‌ఛార్జీలు పెంచింది. నాడు మార్కెట్‌లో నిత్యావసర సరకుల ధరలు పరిగణనలోకి తీసుకొని ప్రతినెల మూడు నుంచి ఏడో తరగతి వరకు రూ.950, ఎనిమిది - పదో తరగతి విద్యార్థులకు రూ.1100 చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో వారంలో ఆరు గుడ్లు, ఆరు అరటి పండ్లు, ఒక రోజు మాంసాహారం వడ్డించాలి. వేకువజామున రాగి జావ, సాయంత్రం చిరుతిళ్లు అందించాలి. అప్పటితో పోల్చితే ప్రస్తుతం సరకుల ధరల్లో ఎంతో మార్పు వచ్చింది. సర్కారు పాత ఛార్జీలనే చెల్లిస్తుండటంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందని పరిస్థితి ఏర్పడింది.

ఎటూ సరిపోని డబ్బులు..  పప్పులు, కూరగాయల ధరలు 30 - 40 శాతం పెరిగాయి. వంటనూనె ధర దాదాపు రెట్టింపయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇసున్న డబ్బులతో నాటి మెనూ ప్రకారం సరకులు కొనుగోలు చేయడం కుదరక విద్యార్థులకు వడ్డించే భోజనంలో కోత పెడుతున్నారు.


ప్రభుత్వ సూచన మేరకు..
- శశికళ, ఎస్సీ సంక్షేమ శాఖాధికారిణి, నిజామాబాద్‌

ప్రభుత్వ సూచన మేరకు వసతి గృహాల్లో మెనూ అమలు చేస్తున్నాం. నిత్యం దాని ప్రకారమే భోజనం   అందిస్తున్నాం. ఎక్కడా పిల్లలకు   నాణ్యతలేమి ఆహారం పెట్టడం లేదు. అలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం.    విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి  వచ్చే విన్నపాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు