logo

అన్నపై తమ్ముడి దాడి

అన్నపై తమ్ముడు దాడి చేసి గాయపర్చిన ఘటన ఎల్లారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

Published : 25 Apr 2024 21:42 IST

ఎల్లారెడ్డి పట్టణం: అన్నపై తమ్ముడు దాడి చేసి గాయపర్చిన ఘటన ఎల్లారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని కొక్కొండ గ్రామానికి చెందిన సైదులు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంటి వద్ద తన తల్లిని తమ్ముడు కొట్టడంతో విషయం తెలుసుకున్న అతడు హైదరాబాద్ నుంచి తన గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో తన తమ్ముడు అడ్డుకుని రాయితో ముఖంపై దాడి చేశాడు. సైదులుకు గాయాలపాలయ్యాయి. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని