logo

ఓటరు చైతన్యం.. డిజిటల్‌ మార్గం

ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం స్వీప్‌ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు, కరపత్రాల ఆవిష్కరణ, మహిళలకు ముగ్గుల పోటీలు, పాఠశాలలు, కళాశాలల్లో నమూనా పోలింగ్‌ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోంది.

Published : 30 Apr 2024 05:38 IST


ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం స్వీప్‌ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు, కరపత్రాల ఆవిష్కరణ, మహిళలకు ముగ్గుల పోటీలు, పాఠశాలలు, కళాశాలల్లో నమూనా పోలింగ్‌ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇలా ఓటరును చేరడానికి, వారిలో చైతన్యం కలిగించడానికి అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. కాలానుగుణంగా జరిగిన మార్పులతో ఎన్నికల సంఘం సైతం డిజిటల్‌ ప్లాట్‌ఫారాలను వేదికగా చేసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు, డిజిటల్‌ వేదికలను ఆశ్రయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్‌శాతం బాగున్నప్పటికీ పట్టణాల్లో ఉదాసీనతపై పోల్‌ప్యానెల్‌ తరచూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సోషల్‌ మీడియా, సభ్య సంస్థల కస్టమర్‌ ఔట్రీచ్‌ ప్లాట్‌ఫారాల వంటి పలు ప్రచార మార్గాలతో వాటాదారులు, ప్రజల్లో చైతన్యం కలిగించవచ్చని ఈసీ అభిప్రాయపడింది. అందులో భాగంగా ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌లలో ‘లెట్స్‌ ఓట్‌ విత్‌ ప్రైడ్‌(రండి సగర్వంగా ఓటేద్దాం)’ అనే నినాదంతో వెబ్‌పేజీతో అవగాహన కల్పిస్తోంది.

- న్యూస్‌టుడే, ఇందల్‌వాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని