logo

ఒకే స్థానం..జిల్లాలు మూడు

నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. నిజామాబాద్‌ జిల్లాలోని నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ గ్రామీణం, బాల్కొండ నియోజకవర్గాలు ఉండగా.. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి.

Published : 30 Apr 2024 05:44 IST

నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. నిజామాబాద్‌ జిల్లాలోని నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ గ్రామీణం, బాల్కొండ నియోజకవర్గాలు ఉండగా.. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. లోక్‌సభ పరిధిలో మొత్తం 1,808 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. 1,288 నిజామాబాద్‌లో, 516 జగిత్యాలలో, 4 రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. ఇది వరకు కమ్మర్‌పల్లి మండలంలో ఉండే మానాల గ్రామం జిల్లాల విభజన సమయంలో రాజన్న సిరిసిల్లలోకి వెళ్లింది. ఆ గ్రామంలోని నాలుగు పోలింగ్‌ కేంద్రాలు సిరిసిల్ల పరిధిలో ఉన్నప్పటికీ గ్రామస్థులు నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి ఓటేస్తారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత అక్కడి ఈవీఎంలను నిజామాబాద్‌ జిల్లాకు తరలిస్తారు.

 న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని