logo

హనుమాన్ చాలీసా పారాయణ్ వార్షికోత్సవ సమ్మేళనం

హిందూ వాహిని ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ్ వార్షికోత్సవ సమ్మేళనం కామారెడ్డిలోని ధర్మశాలలో శనివారం నిర్వహించారు.

Updated : 04 May 2024 17:05 IST

కామారెడ్డి పట్టణం: హిందూ వాహిని ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ్ వార్షికోత్సవ సమ్మేళనం కామారెడ్డిలోని ధర్మశాలలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల రాజన్న సామాజిక సమరసత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాల ప్రసాద్ మాట్లాడారు. హనుమంతుని గుణగణాలను హిందువులు ప్రతి ఒక్కరు మనసులో నిలుపుకోవాలన్నారు. శ్రీరాముడు చూపించినటువంటి బాటలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. నేటి సమాజంలో విచ్ఛిన్నమైన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని