logo

కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

వేసవి నేపథ్యంలో ఉపాధి కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్డీవో చందర్ నాయక్ అన్నారు. మంగళవారం పోసానిపేట్ గ్రామంలో చెరువు పూడికతీత పనులను పరిశీలించారు.

Updated : 07 May 2024 20:32 IST

రామరెడ్డి: వేసవి నేపథ్యంలో ఉపాధి కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్డీవో చందర్ నాయక్ అన్నారు. మంగళవారం పోసానిపేట్ గ్రామంలో చెరువు పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు సరిపడా నీటి వసతి, టెంట్లు ఏర్పాటు చేయాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. కూలీలకు రోజుకు రూపాయలు 300 వేతనం వచ్చే విధంగా పని కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సవిత, ఏపీ ఓ ధర్మారెడ్డి, ఎస్‌పీఎం వేణుగోపాల్, టెక్నికల్ అసిస్టెంట్ జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు