logo

సౌకర్యాలు లేకుంటే దోస్త్‌లో చేర్చం

తెవివి పరిధిలోని డిగ్రీ కళాశాలలకు (2024-25 విద్యా సంవత్సరానికి) ‘వర్సిటీ అనుబంధ గుర్తింపు’ ఇచ్చేందుకు తనిఖీలు సాగుతుండగానే దోస్త్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

Updated : 08 May 2024 06:50 IST

తెవివి క్యాంపస్‌, న్యూస్‌టుడే: తెవివి పరిధిలోని డిగ్రీ కళాశాలలకు (2024-25 విద్యా సంవత్సరానికి) ‘వర్సిటీ అనుబంధ గుర్తింపు’ ఇచ్చేందుకు తనిఖీలు సాగుతుండగానే దోస్త్‌ ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై ‘ఇటు తనిఖీలు.. అటు దోస్త్‌ నోటిఫికేషన్‌’శీర్షికతో ‘ఈనాడు’లో మంగళవారం కథ నం ప్రచురితమైంది. స్పందించిన వర్సిటీ అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య చంద్రశేఖర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. సౌకర్యాలు లేని ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలకు ఇప్పటికే ఏడాది సమయం ఇచ్చామన్నారు. మళ్లీ 15 రోజులు సమయమిచ్చామని అప్పటికీ చర్యలు తీసుకోకుంటే పేర్లను ‘దోస్త్‌’కు ప్రతిపాదించమన్నారు. ఇన్‌ఛార్జి వీసీ, రిజిస్ట్రార్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు